దుబ్బాక: తొలి 4 రౌండ్లలో భాజపాకే ఆధిక్యం

దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో భాజపా అధిక్యం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఫలితాలు వెలువడిన తొలి నాలుగు రౌండ్లలోనూ కలిపి భాజపా 2,648 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ..

Updated : 10 Nov 2020 10:41 IST

సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో భాజపా అధిక్యం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఫలితాలు వెలువడిన తొలి నాలుగు రౌండ్లలోనూ కలిపి భాజపా 2,648 ఓట్ల ఆధిక్యంలో ఉంది. నాలుగు రౌండ్లు ముగిసే సరికి భాజపాకు 13,055 తెరాసకు 10,371, కాంగ్రెస్‌కు 2,158 ఓట్లు పోలయ్యాయి. 23 మంది అభ్యర్థులు పోటీపడిన దుబ్బాకలో విజేత ఎవరో మరి కాసేపట్లో స్పష్టం కానుంది. కొవిడ్‌-19 నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రెండు హాళ్లలో ఏడేసి చొప్పున 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 23 రౌండ్లలో లెక్కింపు జరుగుతుంది. 5 వీవీ ప్యాట్లలోని స్లిప్పులను కూడా లెక్కిస్తారు. ఈవీఎంలు మొరాయించిన పక్షంలో వీవీ ప్యాట్లలోని స్లిప్పులను పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ నెల 3న జరిగిన పోలింగ్‌లో 1,64,192 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 82.61 శాతం పోలింగ్‌ నమోదైంది.

దుబ్బాక ఉపఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది. ప్రధానంగా తెరాస, భాజపా నేతల మధ్య మాటల యుద్ధంతో రాజకీయంగా వేడి రగిలింది. తెరాస నుంచి సోలిపేట సుజాత, భాజపా నుంచి మాధవనేని రఘునందన్‌రావు, కాంగ్రెస్‌ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి పోటీకి దిగిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం ఒంటి గంటలోగా ఫలితాల వెల్లడి పూర్తికావచ్చని అధికారులు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని