గెలిపిస్తే ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. అయినా ఓటమి తప్పలేదు

తమ వర్గాన్ని గెలిపిస్తే పలు ఉచిత పథకాలను అందిస్తామని బాండ్‌ పేపర్‌పై ముద్రించి ప్రచారం చేసినా ఆ అభ్యర్థికి ఓటమి తప్పలేదు. సరికదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తిని 

Updated : 22 Feb 2021 06:04 IST

రావులపాలెం పట్టణం: తమ వర్గాన్ని గెలిపిస్తే పలు ఉచిత పథకాలను అందిస్తామని బాండ్‌ పేపర్‌పై ముద్రించి ప్రచారం చేసినా ఆ అభ్యర్థికి ఓటమి తప్పలేదు. సరికదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తిని  విజయం వరించింది. హామీ పత్రం అందించి పోటీచేసిన సదరు అభ్యర్థి మూడో స్థానంలో నిలవడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం ఊబలంక గ్రామానికి ఆదివారం ఎన్నికలు జరిగాయి. సర్పంచితో పాటు ఏడు వార్డులకు ఓ వర్గం వారు బరిలో నిలిచారు. తాము గెలిస్తే నెరవేర్చే హామీలను రూ.20 స్టాంపు పేపర్‌పై ముద్రించి నోటరీ చేయించి, సంతకాలు పెట్టి మరీ సామాజిక వర్గాల పెద్దలకు అందించారు. ‘ఊబలంక పంచాయతీ సర్పంచి అభ్యర్థి మేడిశెట్టి సురేఖతోపాటు వార్డు సభ్యులను గెలిపిస్తే ముఖ్యమంత్రి జగన్‌ ఆశీస్సులతో గ్రామాలకు పంచరత్నాలు అందిస్తాం’ అని ఆ బాండ్‌ పేపర్‌లో పేర్కొన్నారు. అయితే గ్రామస్థులు సదరు అభ్యర్థినిని కాకుండా వైకాపా రెబల్‌గా స్వతంత్రగా పోటీచేసిన కొక్కిరిగడ్డ లక్ష్మిని గెలిపించారు. ఆమె 287 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని