Eatala Rajendar: భాజపా రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉండకపోవచ్చు: ఈటల

తనకు ఏ బాధ్యతలు అప్పగించాలనేది దిల్లీలోని భాజపా అధినాయకత్వం చూసుకుంటుందని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు.

Updated : 24 May 2023 17:05 IST

హైదరాబాద్‌: తన సేవలు ఎక్కడ అవసరమైతే పార్టీ అక్కడ ఉపయోగించుకుంటోందని మాజీ మంత్రి, భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. అప్పుడైనా.. ఇప్పుడైనా పదవి కావాలని అడిగే వ్యక్తిని కాదని చెప్పారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉండకపోవచ్చన్న ఈటల.. బండి సంజయ్‌ తన శక్తిమేరకు పనిచేస్తున్నారన్నారు. హైదరాబాద్‌లో బుధవారం ఈటల మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.   

‘‘నాకు ఏ బాధ్యతలు ఇవ్వాలనేది దిల్లీలోని భాజపా అధినాయకత్వం చూసుకుంటుంది. రానున్న ఎన్నికల్లో గెలవాలంటే మా శక్తిని ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దిల్లీ నాయకత్వంతో పాటు మేం కూడా ఇదే భావిస్తున్నాం. ఎన్నికల్లో గెలవాలంటే కార్యకర్తల బలం పెంచుకోవడంతోపాటు ఇతర పార్టీల నుంచి సీనియర్‌ నేతలు రావాలని కోరుకుంటున్నాం. పార్టీ బలోపేతం కోసం అందర్నీ భాగస్వామ్యం చేయాలి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై వస్తోన్న ఊహాగానాలు తప్పు. జాతీయ పార్టీలో దిల్లీ నేతలు ఇక్కడికి రావడం.. మేము దిల్లీ వెళ్లడం సహజం’’ అని ఈటల రాజేందర్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని