
Eatala Rajendar: అప్పుల్లో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్: ఈటల రాజేందర్
తుక్కుగూడ: గతంలో తెలంగాణ గడ్డపై కేసీఆర్ అంటే గౌరవం ఉండేదని.. కానీ ఈ 8 ఏళ్లలో ఆయన మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని మాజీ మంత్రి, భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి వారసత్వంగా వచ్చిన అప్పు కేవలం రూ.75వేల కోట్లు మాత్రమేనని చెప్పారు. ప్రభుత్వం రూ.40వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని.. వాటితో కలిపి రాష్ట్ర అప్పు రూ.5లక్షల కోట్లకు చేరిందని ఆరోపించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఈటల మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ పాలనపై విరుచుకుపడ్డారు.
వైఫల్యాలను ఇతరులపై రుద్దుతున్నారు
‘‘కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు, అబద్ధాలు ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోవడంతోనే తన వైఫల్యాలను ఇతరులపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చైతన్యం నింపుకొన్న తెలంగాణ. ప్రజలు తప్పకుండా గుణపాఠం చెబుతారు. అన్నింట్లో రాష్ట్రం నంబర్ వన్ అని కేసీఆర్ చెబుతున్నారు. కానీ అప్పుల్లో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్. రాష్ట్రంలో 1.50లక్షల బెల్టుషాపులు, వేలాది బార్లు, లిక్కర్ షాపులు పెట్టారు. తెలంగాణ ఏర్పడే నాటికి మద్యం ద్వారా వచ్చే ఆదాయం రూ.11వేల కోట్లు ఉండగా.. ప్రస్తుతం అది రూ.37వేల కోట్లకు చేరినట్లు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ప్రకటించారంటే రాష్ట్రం ఎటువైపు పోతుందో ప్రజలు ఆలోచించాలి.
తెలంగాణ వ్యాప్తంగా హుజూరాబాద్ తీర్పు..
గ్రామాల్లో పనులు లేవు. ఉపాధి అవకాశాలు కల్పించడం లేదు. హైదరాబాద్‌లోని సంస్థల్లో తెలంగాణ బిడ్డలు పనిచేసే పరిస్థితి ఉందా? ఇతర రాష్ట్రాల వాళ్లకు ఉద్యోగాలు వస్తున్నాయి. రైతుబంధు వచ్చి పంటలు వేయొద్దన్న ఏకైక సీఎం కేసీఆర్. పంటలు కొనే దమ్ములేక చేతులెత్తేసి ఆ నెపాన్ని కేంద్రంపై రుద్దే ప్రయత్నం చేశారు. కానీ తెలంగాణ రైతాంగం దృష్టిలో ముఖ్యమంత్రి ద్రోహిగా మిగిలిపోయారు. దిల్లీలో ధర్నా చేసినంత మాత్రాన కేసీఆర్ గొప్పోడు కాదు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు కేసీఆర్‌ను బొంద పెట్టాలని చూస్తున్నాయి. హుజూరాబాద్‌లో తెరాస గెలిచేందుకు రూ.600కోట్లు ఖర్చు చేశారు. వందల మంది పోలీసులు.. వేలాది మంది నాయకులు, 13 మంది మంత్రులు ఆరునెలల పాటు పనిచేసినా అక్కడి ప్రజలు తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగురవేశారు. రానున్న ఎన్నికల్లోనూ హూజూరాబాద్ తీర్పును తెలంగాణ వ్యాప్తంగా ఇచ్చి కాషాయ జెండాను ఎగురవేయాలని ప్రజలకు కోరుతున్నా’’ అని ఈటల రాజేందర్ అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (27-06-2022)
-
World News
Most Expensive Pillow: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దిండు.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!
-
India News
Agnipath: అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ.. మూడు రోజుల్లోనే ఎన్ని వచ్చాయంటే..?
-
Technology News
WhatsApp: మహిళల కోసం వాట్సాప్‌లో కొత్త సదుపాయం
-
Sports News
Pakistan: ఒకరు విజయవంతమైతే.. మా సీనియర్లు తట్టుకోలేరు: పాక్ క్రికెటర్
-
Movies News
Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Chiranjeevi: నాకూ గోపీచంద్‌కు ఉన్న సంబంధం అదే: చిరంజీవి
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- Bypolls: యూపీలో భాజపాకు బిగ్ బూస్ట్.. పంజాబ్‌లో ఆప్‌కు భంగపాటు
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- E Passport: ఈ పాస్‌పోర్ట్‌లు వస్తున్నాయ్.. ఎప్పటి నుంచి జారీ చేస్తారు?ఎలా పనిచేస్తాయి?
- PCOD: అధిక బరువుకు బై బై చెప్పేద్దామా.. పరిష్కార మార్గాలివిగో..!
- Agnipath: అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ.. మూడు రోజుల్లోనే ఎన్ని వచ్చాయంటే..?
- IRE vs IND: ఐర్లాండ్‌పై అలవోకగా..
- Droupadi Murmu: ఎట్టకేలకు మోక్షం.. ద్రౌపదీ ముర్ము స్వగ్రామానికి కరెంటు..!