Published : 03 Nov 2021 01:33 IST

Eatala Rajender: ఈటల ఏడోసారి.. ఏ ఎన్నికల్లో ఎంత మెజారిటీ..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా జరిగిన హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో భాజపా నేత ఈటల రాజేందర్‌ విజయం సాధించారు. దీంతో వరుసగా ఆయన ఏడోసారి ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టబోతున్నారు. నాలుగు సార్లు సాధారణ ఎన్నికల్లో ఆయన విజయం సాధించగా.. మూడు సార్లు ఉప ఎన్నికల్లో విజయం సాధించడం గమనార్హం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి నాలుగుసార్లు, తెలంగాణ అసెంబ్లీకి మూడుసార్లు (ప్రస్తుత గెలుపుతో కలిపి) గెలుపొందారు. తొలుత కమలాపూర్‌ నియోజకవర్గం నుంచి రెండుసార్లు విజయం సాధించారు. అనంతరం హుజూరాబాద్‌ నుంచి పోటీ చేశారు. తెరాస స్థాపించిన తొలినాళ్లలో ఆ పార్టీలో చేరిన ఈటల ఆరుసార్లు ఆ పార్టీ గుర్తుపైనే గెలుపొందారు. ఇప్పుడు అదే పార్టీ నుంచి బయటకొచ్చి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ద్వారా జరిగిన ఉప ఎన్నికలో భాజపా తరఫున పోటీ చేసి తెరాస అభ్యర్థిపై  గెలుపొందడం విశేషం. 2004లో అత్యత్పలంగా 19 వేల మెజారిటీతో గెలుపొందిన ఈటల..  2010 ఎన్నికల్లో అత్యధికంగా 79 వేల మెజారిటీ సాధించారు. ఇక మిగిలిన ఎన్నికల్లో ఎవరిపై ఎన్ని ఓట్లతో గెలిచారో ఇప్పుడు చూద్దాం..

ఈటల గెలుపు ప్రస్థానం..
*
2004 
నియోజకవర్గం- కమలాపూర్ 
ఈటల రాజేందర్: 68,393
ముద్దసాని దామోదర్ రెడ్డి: 48,774
మెజారిటీ: 19,619

2008 (ఉప ఎన్నిక)
నియోజకవర్గం- కమలాపూర్
ఈటల రాజేందర్: 54,092
ముద్దసాని దామోదర్ రెడ్డి: 31,808
మెజారిటీ: 22,284

2009 
నియోజకవర్గం- హుజూరాబాద్
ఈటల రాజేందర్ : 56,752 
కృష్ణమోహన్ వకులాభరణం: 41,717
మెజారిటీ: 15,035

2010 (ఉప ఎన్నిక)
నియోజకవర్గం- హుజూరాబాద్
ఈటల రాజేందర్: 93,026
ముద్దసాని: 13,799
మెజారిటీ: 79,227

2014
నియోజకవర్గం- హుజూరాబాద్
ఈటల రాజేందర్ : 95,315
కేతిరి సుదర్శన్ రెడ్డి : 38,278
మెజారిటీ: 57,037

2018
నియోజకవర్గం- హుజూరాబాద్
ఈటల రాజేందర్ : 1,04,840
కౌశిక్ రెడ్డి: 61,121
మెజారిటీ: 43,719

2021 (ఉప ఎన్నిక)
నియోజకవర్గం- హుజూరాబాద్
ఈటల రాజేందర్ 1,06,780
గెల్లు శ్రీనివాస్ యాదవ్ 82,712
మెజారిటీ- సుమారు 24 వేలు

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని