Eatela rajender: పొంగులేటి.. జూపల్లి నాకే రివర్స్‌ కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు: ఈటల

భారత్‌ రాష్ట్ర సమితి (భారాస) బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు భాజపాలో చేరికపై హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Updated : 29 May 2023 16:51 IST

హైదరాబాద్‌: భారత్‌ రాష్ట్ర సమితి (భారాస) బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు భాజపాలో చేరికపై హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ భాజపాలో చేరడం కష్టమే అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఈటల మీడియాతో మాట్లాడారు.

‘‘ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ బలంగా ఉంది. భాజపా బలంగా లేదు. పొంగులేటి, జూపల్లితో నేను రోజూ మాట్లాడుతున్నాను. వారే నాకు రివర్స్‌ కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. ఇప్పటివరకు వారిద్దరూ కాంగ్రెస్‌లో చేరకుండా మాత్రమే నేను ఆపగలిగాను. భాజపాలో చేరేందుకు వారికి కొన్ని ఇబ్బందులున్నాయి. ఇప్పటికీ కమ్యూనిస్ట్‌ ఐడియాలజీ ఉన్న జిల్లా ఖమ్మం. దేశానికి కమ్యూనిస్టు సిద్ధాంతం నేర్పిన గడ్డ తెలంగాణ. ఖమ్మంలో వామపక్షాలు, తెదేపా సహా అన్ని పార్టీలుంటాయి. ప్రియాంక గాంధీని అప్పట్లో పొంగులేటి కలిశారని తెలిసింది. అంతకంటే ముందే ఖమ్మం వెళ్లి పొంగులేటితో చర్చించాను’’ అని ఈటల వ్యాఖ్యానించారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని