
TS News: కమలాపూర్‌లో ఈటల రోడ్‌షో
కమలాపూర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ తాను ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటన చేసిన తర్వాత ఆయన తొలిసారి నియోజకవర్గానికి వచ్చారు. పర్యటనలో భాగంగా కమలాపూర్ మండలంలో ద్విచక్రవాహనాలతో ఆయన అభిమానులు రోడ్‌షో చేపట్టారు. శంభునిపల్లి, కానెపర్తి గ్రామాల మీదుగా రోడ్‌షో కొనసాగింది. ఈటల మద్దతుదారులు, అభిమానులు, యువకులు ‘జై-ఈటల’ నినాదాలతో హోరెత్తించారు. మహిళలు మంగళహారతులతో ఈటలకు ఘన స్వాగతం పలికారు. కమలాపూర్‌లో అంబేడ్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈటల పర్యటన దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు.
మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన ఈటల.. ఇటీవల తెరాస పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకుముందు దిల్లీ పర్యటనకు వెళ్లిన ఈటల భాజపా జాతీయ స్థాయి నాయకులను కలిశారు. మరోవైపు ఆయన వారం రోజుల్లో భాజపా తీర్థం పుచ్చుకోనున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.