Eatala Rajender: నేను సీఎం అభ్యర్థిని కాదు : ఈటల రాజేందర్‌

తాను ముఖ్యమంత్రి అభ్యర్థినంటూ వస్తున్న వార్తలను హుజూరాబాద్‌ ఎమ్మెల్యే, భాజపా కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్‌ ఖండించారు...

Published : 11 Aug 2022 01:26 IST

హైదరాబాద్‌: తాను ముఖ్యమంత్రి అభ్యర్థినంటూ వస్తున్న వార్తలను హుజూరాబాద్‌ ఎమ్మెల్యే, భాజపా కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్‌ ఖండించారు. భాజపా క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, ఇక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలు పార్టీ నియమనిబంధనలకు కట్టుబడి ఉంటారని స్పష్టం చేశారు. పదవులు.. వ్యక్తులుగా నిర్ణయించుకోలేరని, పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తారని వివరించారు. నేతల సామర్థ్యాన్ని గుర్తించి పార్టీ సరైన నిర్ణయం తీసుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఈటల రాజేందర్‌ అంటూ పలు పత్రికలు, ఛానళ్లు, సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను ఖండిస్తున్నట్టు చెప్పారు.  తెలంగాణలో కేసీఆర్‌ నియంతృత్వ పాలన అంతమే తన లక్ష్యమని పేర్కొన్నారు.  కాషాయ జెండాను ఈ గడ్డ మీద ఎగరేయడం కోసం పార్టీ ఏ బాధ్యత అప్పగించినా శక్తివంచన లేకుండా నిర్వర్తిస్తానని ఈటల రాజేందర్‌ తెలిపారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని