Telangana News: భాజపాపై ఉన్న కోపాన్ని కేసీఆర్‌ రైతులపై చూపిస్తున్నారు: ఈటల రాజేందర్‌

భారతీయ జనతా పార్టీపై ఉన్న కోపాన్ని సీఎం కేసీఆర్ రైతాంగం మీద చూపిస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు.

Published : 23 Mar 2022 16:50 IST

హైదరాబాద్‌ : భారతీయ జనతా పార్టీపై ఉన్న కోపాన్ని సీఎం కేసీఆర్ రైతాంగం మీద చూపిస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమన్నారు. ధాన్యం సేకరణ కొత్తగా వచ్చింది కాదని.. దశాబ్దాలుగా కొనసాగుతుందని తెలిపారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఈటల మీడియాతో మాట్లాడారు. ధాన్యం సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏజెన్సీలా పనిచేస్తుందని ఆరోపించారు. ధాన్యం పండించి పార్టీ కార్యాలయాలు, ఇళ్ల ముందు పోస్తామని సీఎం బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. వరి వేయొద్దంటే రైతుల పరిస్థితేంటని ప్రశ్నించారు. తెలంగాణలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని కేంద్రం ఎక్కడా చెప్పలేదన్నారు. భాజపా అధికారంలోకి వచ్చాక ప్రతి పంటను కొనుగోలు చేస్తామని ఈటల స్పష్టం చేశారు. రాష్ట్ర రైతాంగం ప్రయోజనాల కోసం తెలంగాణ భాజపా శాఖ కృషి చేస్తుందన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని