Eatala Rajender : దిల్లీ బయలుదేరిన ఈటల రాజేందర్
భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దిల్లీ బయలుదేరి వెళ్లారు. అధిష్ఠానం పిలుపు మేరకు ఆయన హస్తినకు వెళ్లినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.

హైదరాబాద్ : భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దిల్లీ బయలుదేరి వెళ్లారు. అధిష్ఠానం పిలుపు మేరకు ఆయన హస్తినకు వెళ్లినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భాజపాలో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. పార్టీలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్ రెండు వర్గాలుగా విడిపోయినట్లు అధిష్ఠానం దృష్టికి వచ్చినట్లు సమాచారం. దీంతో గ్రూపులను రూపుమాపే చర్యలను చేపట్టిన అధిష్ఠానం.. ఇందులో భాగంగానే ఈటలను దిల్లీకి పిలిచినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.