MLC By Election: రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు 12న ఉప ఎన్నికలు

దేశంలోని నాలుగు రాష్ట్రాల పరిధిలో ఖాళీ అయిన ఐదు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు జులై 12న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం తెలిపింది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది.

Published : 19 Jun 2024 03:40 IST

షెడ్యూలు విడుదల చేసిన ఎన్నికల సంఘం

ఈనాడు, అమరావతి, దిల్లీ: దేశంలోని నాలుగు రాష్ట్రాల పరిధిలో ఖాళీ అయిన ఐదు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు జులై 12న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం తెలిపింది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలతో పాటు...కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌లలో ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తారు. ఏపీలో వైకాపా తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన రామచంద్రయ్య ఆ పార్టీకి రాజీనామా చేసి తెదేపాలో చేరడంతో ఆయనపై మార్చి 11న అనర్హత వేటు పడింది. వైకాపా తరఫున ఎన్నికైన షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్‌ కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి తెదేపాలో చేరారు. ఇక్బాల్‌ రాజీనామాను శాసనమండలి ఛైర్మన్‌ మోషేను రాజు ఏప్రిల్‌ 5న ఆమోదించారు. దీంతో రామచంద్రయ్య, ఇక్బాల్‌ స్థానాలు ఖాళీ అయ్యాయి. వాస్తవంగా వీరి పదవీకాలం 2027 మార్చి 29 వరకు ఉంది. ఖాళీ అయిన ఈ రెండు స్థానాలకు ఈ నెల 25న ఉప ఎన్నికల ప్రకటన వెలువడనుంది. ఆరోజు నుంచి జులై 2 వరకు నామినేషన్లు  స్వీకరిస్తారు. తర్వాత జులై 5 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువునిచ్చారు. జులై 12న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని