ECI: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా.. షెడ్యూల్‌ విడుదల చేసిన ఈసీ

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Elections)కు నగారా మోగింది. త్వరలో ఖాళీ కానున్న స్థానాల్లో ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) (ECI) షెడ్యూల్‌ విడుదల చేసింది.

Updated : 09 Feb 2023 17:21 IST

దిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Elections)కు నగారా మోగింది. త్వరలో ఖాళీ కానున్న స్థానాల్లో ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) (ECI) షెడ్యూల్‌ విడుదల చేసింది. ఏపీ, తెలంగాణలోని ఉపాధ్యాయ, పట్టభద్రులు, స్థానిక సంస్థల్లో ఖాళీ అవనున్న స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ, 8 స్థానిక సంస్థల స్థానాలు (మొత్తం 13), తెలంగాణలో ఒక్కో ఉపాధ్యాయ, స్థానిక సంస్థల స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29తో ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది.

ఏపీ, తెలంగాణలో ఎన్నికలు జరగనున్న స్థానాలివే..

ఏపీలోని ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం పట్టభద్రుల స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీనితో పాటు ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు ఉపాధ్యాయ స్థానాల్లో ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది. అనంతపురం, కడప, నెల్లూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లోనూ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలోని హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ స్థానంతో పాటు హైదరాబాద్‌ స్థానిక సంస్థల స్థానంలో ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది.

ముఖ్యమైన తేదీలు..

నోటిఫికేషన్‌- ఫిబ్రవరి 16

నామినేషన్లకు చివరి తేదీ- ఫిబ్రవరి 23

నామినేషన్ల పరిశీలన- ఫిబ్రవరి 24

నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ- ఫిబ్రవరి 27

ఎన్నికల పోలింగ్‌ -మార్చి 13

ఓట్ల లెక్కింపు- మార్చి 16


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని