Munugode Bypoll: మునుగోడులో గుర్తు మార్పు.. ఆర్వోపై ఈసీ సీరియస్‌

మునుగోడు ఉపఎన్నికలో గుర్తు మార్పు విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీవ్రంగా పరిగణించింది. మునుగోడు రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో)పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

Updated : 20 Oct 2022 11:42 IST

దిల్లీ: మునుగోడు ఉపఎన్నికలో గుర్తు మార్పు విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీవ్రంగా పరిగణించింది. మునుగోడు రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో)పై ఆగ్రహం వ్యక్తం చేసింది. యుగతులసి పార్టీ అభ్యర్థి కె.శివకుమార్‌కు కేటాయించిన రోడ్డు రోలర్‌ గుర్తు మార్పును ఈసీఐ తప్పుబట్టింది. మునుగోడు అభ్యర్థులకు కేటాయించిన గుర్తుల జాబితా సవరించాలని స్పష్టం చేసింది.

ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో ఆర్వో నుంచి వివరణ తీసుకోవాలని.. నివేదికను సాయంత్రంలోపు పంపాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో)ను ఈసీఐ ఆదేశించింది. ఈసీఐ ఆదేశాల నేపథ్యంలో ఫారం 7(ఎ)ను ఎన్నికల అధికారులు సవరించారు. శివకుమార్‌కు తిరిగి రోడ్డు రోలర్‌ గుర్తును కేటాయిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు.

ఈ నేపథ్యంలో మారిన గుర్తులతో బ్యాలెట్‌ ముద్రణకు చర్యలు చేపట్టనున్నారు. తనకు మొదట రోడ్డు రోలర్ గుర్తు కేటాయించి తర్వాత బేబీ వాకర్‌ గుర్తు ఇచ్చారని యుగతులసి పార్టీ అభ్యర్థి శివకుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆర్వోపై ఈసీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాజాగా ఆదేశాలు ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని