Tejashwi Yadav: ఈడీ, సీబీఐలకు నా ఇంట్లోనే ఆఫీస్‌లను ఏర్పాటు చేస్తా..!

కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ వంటి వాటికి భయపడే ప్రసక్తే లేదని బిహార్‌ (Bihar Politics) ఉప ముఖ్యమంత్రి తేజస్వి ప్రసాద్‌ యాదవ్‌ (Tejashwi Yadav) పేర్కొన్నారు.

Published : 12 Aug 2022 01:32 IST

భయపడే ప్రసక్తే లేదన్న బిహార్‌ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌

పట్నా: కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ (Enforcement Directorate), సీబీఐ వంటి వాటికి భయపడే ప్రసక్తే లేదని బిహార్‌ (Bihar Politics) ఉప ముఖ్యమంత్రి తేజస్వి ప్రసాద్‌ యాదవ్‌ (Tejashwi Yadav) పేర్కొన్నారు. అటువంటి దాడుల వల్ల ‘శాంతి’ వస్తుందంటే ఆ సంస్థలకు తన ఇంటిలోనే కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. భాజపా తన ప్రత్యర్థి నేతలపై దాడులు చేయిస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ వస్తోన్న ఆరోపణలపై తేజస్వీ యాదవ్‌ ఇలా స్పందించారు.

‘గతంలో ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలోనూ ఈడీ, సీబీఐ సంస్థలకు భయపడలేదు. బిహార్‌ ప్రయోజనాల కోసమే కేంద్రంపై పోరాటం కొనసాగిస్తాను. శాంతి చేకూరుతుందంటే నా ఇంట్లోనే ఆ దర్యాప్తు సంస్థలకు ఆఫీసులను ఏర్పాటు చేస్తాను. అయినా కూడా శాంతి లభించలేదంటే నేనేమీ చేయలేను’ అంటూ పాత్రికేయులతో జరిపిన ఇష్టాగోష్ఠిలో ఆర్జేడీ నేత తేజస్వీ ప్రసాద్‌ పేర్కొన్నారు. ఇక ఆయనపై గతంలో నమోదైన మనీలాండరింగ్‌ (Money Laundering) కేసును ప్రస్తావించిన ఆయన.. తాను చిన్నతనంలో ఉన్నప్పుడు ఆ కేసు నమోదైందని గుర్తుచేశారు. ఒకవేళ నిజంగా నేరం చేసి ఉంటే తనపై ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని