Telangana News: ఫెమా నిబంధనల ఉల్లంఘన.. తెరాస ఎమ్మెల్యేను విచారిస్తున్న ఈడీ

ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాలపై ఇబ్రహీంపట్నం తెరాస ఎమ్మెల్యే మంచిరెడ్డి

Updated : 27 Sep 2022 16:11 IST

హైదరాబాద్: ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాలపై ఇబ్రహీంపట్నం తెరాస ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. నిన్న మంచిరెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఇవాళ విచారణకు హాజరైన ఎమ్మెల్యేను ఈడీ అధికారులు రెండు గంటలుగా ప్రశ్నిస్తున్నారు. బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన వివరాలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని అరెస్టు చేయాలి: మల్‌రెడ్డి రంగారెడ్డి

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌నేత మల్‌రెడ్డి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. ‘‘ఆయన చేసిన అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. నేను ముందే చెప్పా.. దళితులు, పేదల భూములు కబ్జాచేసి రూ.వందల కోట్లు విదేశాలకు తరలించారు. క్యాసినో పేరుతో జూదం ఆడుతూ జల్సా చేస్తున్నారు. కిషన్‌రెడ్డి అంటేనే జూదం... ఇబ్రహీంపట్నం పేరును పాడు చేశారు. ఆయనపై చర్యలు తీసుకుని అక్రమ ఆస్తులు మొత్తం కక్కించాలి’’ అని మల్‌రెడ్డి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని