‘భాజపా ఎంపీని కాబట్టే ఈడీ నా వెంట పడదు..’

మహారాష్ట్రలో ఎన్సీపీ నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌పై కొన్ని రోజులుగా ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు అదే పార్టీకి చెందిన నాయకుడు అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఇంటిపై ఇప్పటికే ఐదుసార్లు సీబీఐ సోదాలు చేసింది. వీటితోపాటు ఎన్‌సీబీ కూడా మరికొంతమంది...

Published : 26 Oct 2021 01:32 IST

ముంబయి: మహారాష్ట్రలో ఎన్సీపీ నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌పై కొన్ని రోజులుగా ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు అదే పార్టీకి చెందిన నాయకుడు అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఇంటిలో ఇప్పటికే ఐదుసార్లు సీబీఐ సోదాలు చేసింది. వీటితోపాటు ఎన్‌సీబీ కూడా మరికొంతమంది ప్రముఖుల ఇళ్లలో సోదాలు జరుపుతోంది. అయితే.. కేవలం ప్రతిపక్షాలను టార్గెట్‌ చేసుకొనే కేంద్ర దర్యాప్తు సంస్థలను భాజపా దుర్వినియోగం చేస్తోందని అధికార కూటమి(మహా వికాస్‌ అఘాడీ)కి పలువురు నేతలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంలో రాష్ట్రంలోని సాంగ్లీకి చెందిన భాజపా ఎంపీ సంజయ్‌కాకా పాటిల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

గతంలోనూ ఓ నేత..

స్థానికంగా ఓ బహిరంగ కార్యక్రమంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ‘నేను ప్రస్తుతం భాజపా ఎంపీగా ఉన్న నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌(ఈడీ) నా వెంటపడదు. ఏదో డాబు కోసం రూ. 40 లక్షల విలువైన లగ్జరీ కార్లను కొనుగోలు చేసేందుకు రుణం తీసుకుంటాం. అప్పుడు మా వద్ద ఉన్న రుణ మొత్తాన్ని చూసి ఈడీ కూడ ఆశ్చర్యపోతుంది’ అని పేర్కొనడం గమనార్హం. ఇటీవలే అదే పార్టీకి చెందిన నేత హర్షవర్ధన్‌ పాటిల్‌ సైతం ఈ తరహా వ్యాఖ్యలే చేశారు. ‘భాజపాలో చేరాక ప్రశాంతంగా ఉంది. ఎటువంటి విచారణలు లేనందున మంచి నిద్ర కూడ వస్తోంది’ అని అన్నారు. మ అయితే.. ఆ వ్యాఖ్యలు కాస్త వైరల్ కావడంతో తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నట్లు హర్షవర్ధన్‌ వివరణ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని