Aaditya Thackeray: ఏక్‌నాథ్‌ శిందే సర్కార్‌ కూలిపోవడం ఖాయం: ఆదిత్యఠాక్రే

ద్రోహాన్ని మహారాష్ట్ర ఎన్నడూ సహించదని.. శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందే (Eknath shindhe) సారథ్యంలో ఏర్పాటైన ప్రభుత్వం......

Published : 02 Aug 2022 02:04 IST

సింధుదుర్గ్‌: ద్రోహాన్ని మహారాష్ట్ర ఎన్నడూ సహించబోదని.. శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందే (Eknath shindhe) సారథ్యంలో ఏర్పాటైన ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని యువసేన చీఫ్‌, మాజీ మంత్రి ఆదిత్యఠాక్రే (Aaditya Thackeray) వ్యాఖ్యానించారు. కొంకణ్‌ ప్రాంతంలో పర్యటిస్తున్న ఆయన సోమవారం శివసేన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. శిందే సర్కార్‌ సంక్షేమ రాజకీయాలపై కాకుండా డర్టీ పాలిటిక్స్‌పై దృష్టి సారించిందని మండిపడ్డారు. ఈ పొలిటికల్‌ డ్రామా అంతా ఒకటిన్నర నెలలేనన్న ఆదిత్య ఠాక్రే.. ప్రభుత్వం కూలిపోవడం మాత్రం ఖాయమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా వర్షాలు పడుతున్నా.. వరదలు సంభవిస్తున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు.

గత నెలలో శివసేన నుంచి ఏక్‌నాథ్‌ శిందేతో పాటు 40 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో ఉద్ధవ్‌ ఠాక్రే సారథ్యంలోని మహా వికాస్‌ అఘాడీ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తర్వాత నాటకీయ పరిణామాల మధ్య భాజపా మద్దతుతో శిందే ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడణవీస్‌ ఉపముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని