Eknath Shinde: శిందే వర్గం పార్టీ పెట్టనుందా..? పేరు అదేనా..?

మహారాష్ట్ర రాజకీయాలు రోజులు గడుస్తున్నా కొద్దీ కాకపుట్టిస్తున్నాయి. ఇటు ఉద్ధవ్ వర్గం.. అటు శిందే ఏ వర్గం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.

Updated : 25 Jun 2022 15:41 IST

అసమ్మతి ఎమ్మెల్యేల తీరును నిరసిస్తోన్న శివసైనికులు.. ముంబయిలో 144 సెక్షన్‌

ముంబయి: మహారాష్ట్ర రాజకీయాలు రోజులు గడుస్తున్నా కొద్దీ కాకపుట్టిస్తున్నాయి. ఇటు ఉద్ధవ్ వర్గం.. అటు శిందే వర్గం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. శిందే వర్గం కొత్తపార్టీపై ప్రకటన చేయొచ్చని వార్తలు వస్తున్నాయి. అసమ్మతి నేతలు తమ బృందానికి ‘శివసేన బాలాసాహెబ్ ఠాక్రే’ అనే పేరు పెట్టనున్నట్టు సంబంధిత వర్గాలు మీడియాకు వెల్లడించాయి. శివసేన జాతీయ కార్యవర్గంతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడనున్న సమయంలో ఈ పేరు గురించి బయటకువచ్చింది.  

 ముంబయిలో 144 సెక్షన్‌..

మరోపక్క అసమ్మతి ఎమ్మెల్యేల వైఖరిని నిరసిస్తూ.. శివసేన కార్యకర్తలు రాష్ట్రంలో పలు చోట్ల నిరసనలు చేపడుతున్నారు. పుణెలోని రెబెల్ ఎమ్మెల్యే తానాజీ సావంత్ కార్యాలయంపై శివసేన కార్యకర్తలు దాడి చేశారు. ఇది ప్రారంభం మాత్రమేనని, మరికొన్ని కార్యాలయాలను ధ్వంసం చేస్తామంటూ కొందరు పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. ఈ పరిస్థితులను గమనించిన హోం శాఖ రాజధాని నగరం ముంబయిలో 144 సెక్షన్‌ విధించింది. ముంబయిలో హై అలర్ట్ ప్రకటించి, అన్ని రాజకీయ పార్టీల కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ క్రమంలో థానేలో శిందే ఇంటివద్ద భద్రత పెంచారు. ఇప్పటికే ఆయన కంచుకోట థానేలో 144 సెక్షన్‌ను విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన అసమ్మతి వర్గ నేతలకు నాయకత్వం వహిస్తున్నారు. వారంతా అస్సాంలోని గువాహటిలో మకాం వేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని