Eknath Shinde : శివసేన కోసం కొత్త భవనం నిర్మించనున్న శిందే వర్గం..?

శివసేన పార్టీ తమదే అంటే తమదేనంటూ.. ఏక్‌నాథ్‌ శిందే, ఉద్ధవ్‌ ఠాక్రే వర్గాల మధ్య పోరు నడుస్తోన్న విషయం తెలిసిందే.

Updated : 13 Aug 2022 15:06 IST

ముంబయి : శివసేన పార్టీ తమదే అంటే తమదేనంటూ.. ఏక్‌నాథ్‌ శిందే, ఉద్ధవ్‌ ఠాక్రే వర్గాల మధ్య పోరు నడుస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. శిందే వర్గం ముంబయిలో కొత్త శివసేన భవనం నిర్మించనున్నట్లు సమాచారం. పార్టీ కార్యకలాపాల నిర్వహణ కోసం.. ఠాక్రే వర్గానికి సమాంతరంగా ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని తిరుగుబాటు వర్గం ప్రయత్నిస్తోందని పలువురు పేర్కొంటున్నారు.

అయితే.. ఏ ప్రాంతంలో ఈ కొత్త భవనాన్ని ఏర్పాటు చేయాలన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం ముంబయి దాదర్‌లో ఉన్న శివసేన కార్యాలయం సమీపంలోనే స్థలం కోసం శిందే వర్గం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తలను ఆ రాష్ట్ర మంత్రి ఉదయ్‌ సామంత్‌ ఖండించారు. ‘దాదర్‌లో శివసేన భవన్‌కు సమాంతరంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామన్న వార్తల్లో నిజం లేదు. అయితే.. ముఖ్యమంత్రి సామాన్య ప్రజలను కూడా కలుసుకునేందుకు వీలుగా ఓ కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. మేం శివసేన భవన్‌ను గౌరవిస్తాం. అది అలాగే ఉంటుంది ’అని మంత్రి స్పష్టం చేశారు.

ఇక తమ వర్గమే అసలైన శివసేన అంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే పేర్కొంటున్న విషయం తెలిసిందే. బాలాసాహెబ్‌ సిద్ధాంతాలను అనుసరించే వ్యక్తిని తానంటూ గతంలో పలు మార్లు ఆయన ప్రకటించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని