Telangana news: భూదందాకు రూపకర్త కేసీఆరే: ఈటల తీవ్ర ఆరోపణలు

భూప్రక్షాళన పేరుతో ప్రభుత్వ పెద్దలు వేల ఎకరాలు కొట్టేస్తున్నారని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల

Published : 21 Sep 2022 01:59 IST

హైదరాబాద్‌: భూప్రక్షాళన పేరుతో ప్రభుత్వ పెద్దలు వేల ఎకరాలు కొట్టేస్తున్నారని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ ఆరోపించారు. భూదందాకు రూపకర్త, సృష్టికర్త సీఎం కేసీఆరేనన్నారు. ధరణిలో నమోదైన భూముల రిజిస్ట్రేషన్లు, భూమి క్రయ విక్రయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజల్ని వేధించే హక్కు సీఎం కేసీఆర్‌కు ఎవరు ఇచ్చారు అని ప్రశ్నించారు. దేశంలో భూములన్నీ ఎన్‌ఐసీలో భద్రంగా ఉన్నాయన్న ఈటల.. రాష్ట్రంలో మాత్రం ఇప్పటికే నాలుగు సంస్థలు మార్చారని ఆరోపించారు. భూ సమస్యల వల్ల అనేకమంది రైతులు ప్రాణాలు తీసుకొంటున్నారని.. భూ సమస్యలతో న్యాయస్థానం మెట్లు ఎక్కుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని