
TS News: హుజూరాబాద్‌లో తెరాస రూ.500 కోట్లు ఖర్చు పెట్టింది: ఈటల
హుజూరాబాద్: తెరాస ఎన్ని కుట్రలు చేసినా ధైర్యంగా ముందుకొచ్చి ఓటర్లు తనను ఆశీర్వదించారని హుజూరాబాద్ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ తెలిపారు. పోలింగ్ ముగిసిన అనంతరం భాజపా నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ‘‘అన్ని ఉప ఎన్నికల్లో మాదిరిగా ఇక్కడ కూడా ఓటర్లకు డబ్బులు పంచి, అసత్య వాగ్దానాలు చేసి గెలవొచ్చని కేసీఆర్ ప్రయత్నించారు. కానీ, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు చరిత్రను తిరగరాశారని భావిస్తున్నా. కేసీఆర్ కుట్రను హుజూరాబాద్ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఉప ఎన్నిక కోసం తెరాస రూ.400 నుంచి 500 కోట్లు ఖర్చు పెట్టింది. అయినా, ధర్మం, ప్రజాస్వామ్యాన్ని, ఈటలను కాపాడుకోవాలని ప్రజలు భావించారు. హుజూరాబాద్ ఓటర్లకు ధన్యవాదాలు. హుజూరాబాద్ మొదటి నుంచి చైతన్యవంతమైన గడ్డ. అన్యాయాన్ని, ఆధిపత్యాన్ని సహించే గడ్డ కాదు. ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్, అర్వింద్, విజయశాంతి, డీకే అరుణ, కేంద్రమంత్రులు, జాతీయ నేతలకు కృతజ్ఞతలు. కష్టపడి పనిచేసిన నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు’’ అని ఈటల రాజేందర్ తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.