Naveen Patnaik: నేనే ప్రతిపక్ష నేతగా ఉంటా: మాజీ సీఎం నవీన్‌ పట్నాయక్‌

ఒడిశా అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా తానే వ్యవహరించనున్నట్లు మాజీ సీఎం, బిజు జనతాదళ్‌ చీఫ్‌ నవీన్‌ పట్నాయక్‌ విలేకర్లకు వెల్లడించారు.

Published : 20 Jun 2024 00:11 IST

భువనేశ్వర్‌: ఒడిశా అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా తానే వ్యవహరించనున్నట్లు మాజీ సీఎం, బిజు జనతాదళ్‌ (బిజద) అధినేత నవీన్‌ పట్నాయక్‌ వెల్లడించారు. బుధవారం జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో గెలుపొందిన పార్టీ అభ్యర్థులకు అభినందనలు తెలిపినట్టు విలేకర్లకు చెప్పారు. బిజద ఎమ్మెల్యేలంతా తనను పార్టీ సభాపక్ష నేతగా ఎన్నుకున్నారన్నారు. దీంతో తానే ప్రతిపక్ష నేతగా ఉంటానన్నారు. మరోవైపు, సీనియర్‌ ఎమ్మెల్యే ప్రసన్న ఆచార్య ప్రతిపక్ష ఉప నేతగా, మాజీ స్పీకర్‌ ప్రమిలా మల్లిక్‌ సభలో తమ పార్టీ తరఫున చీఫ్‌ విప్‌గా వ్యవహరిస్తారన్నారు. 

ఓహో.. మీరేనా నన్ను ఓడించింది.. కంగ్రాట్స్‌: నవీన్‌ పట్నాయక్‌

దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు ఒడిశాను పాలించిన బిజు జనతాదళ్‌ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం చవి చూసిన విషయం తెలిసిందే. మొత్తం 147 స్థానాలకు గాను భాజపా 78 సీట్లతో అధికారం కైవసం చేసుకోగా.. బిజు జనతాదళ్‌ 51, కాంగ్రెస్‌ 14, స్వతంత్రులు 1, సీపీఎం 1 స్థానాలు చొప్పున గెలుచుకున్నాయి. దీంతో భాజపాకు చెందిన ఆదివాసీ నేత మోహన్‌చరణ మాఝి ఒడిశా కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని