Guntur: తెనాలిలో వైకాపా అరాచక శక్తులు పేట్రేగిపోతున్నాయి: ఆలపాటి రాజేంద్రప్రసాద్
ఆంధ్రా ప్యారిస్‌గా పేరుగాంచిన తెనాలిలో వైకాపా అరాచక శక్తులు పేట్రేగిపోతున్నాయని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెనాలి: మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ యుగంధర్‌పై నలుగురు వైకాపా కౌన్సిలర్లు దాడికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో కలకలం రేపింది. నలుగురు కౌన్సిలర్ల నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరుతూ తెదేపా శ్రేణులతో కలిసి ఆయన తెనాలి 2వ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
కౌన్సిలర్‌తో పాటు ఆందోళనలో పాల్గొన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఆంధ్రా ప్యారిస్‌గా పేరుగాంచిన తెనాలిలో వైకాపా అరాచక శక్తులు పేట్రేగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా అవినీతిని ప్రశ్నించిన పాపానికి తెదేపా కౌన్సిలర్ యుగంధర్‌పై దాడి చేయడం దుర్మార్గమన్నారు. ప్రజాసమస్యలపై ప్రశ్నించాల్సిన చోట దాడులు చేయడమేంటని ప్రశ్నించారు. వైకాపా నేతల తీరు మార్చుకోకపోతే ప్రజల చేతిలో మూల్యం చెల్లించక తప్పదన్నారు. యుగంధర్‌పై దాడి చేసిన వారిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Virat In ODI WC 2023: ‘మీరేమన్నారో విరాట్‌కు తెలిస్తే.. మీ పని అంతే’.. కివీస్ మాజీకి శ్రీశాంత్ కౌంటర్
-
Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
Flipkart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ వచ్చేశాయ్.. ప్రత్యేక ఆఫర్లతో పండగ సేల్
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Asian Games: షూటింగ్లో మరో గోల్డ్.. వుషూలో రజతం
-
మా స్నేహం మీద ఒట్టు.. చంద్రబాబు ఎలాంటి తప్పూ చేయరు: బాబు బాల్య స్నేహితులు