Balineni: పార్టీలోని కొందరు కావాలనే ఇబ్బంది పెట్టారు.. సీఎంతో భేటీ అనంతరం బాలినేని

గురువారం సాయంత్రం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి  భేటీ అయ్యారు. జిల్లాలో తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు.

Updated : 01 Jun 2023 21:42 IST

తాడేపల్లి: సీఎం జగన్‌తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ ముగిసింది. గురువారం సాయంత్రం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో సమావేశమైన బాలినేని .. జిల్లాలో తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. సీఎంతో సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘అన్ని అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించా. జిల్లాలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లా. ప్రొటోకాల్‌ పెద్ద విషయం కాదు.. దానిపై ఫిర్యాదు చేయడానికి ఏముంటుంది. కొత్తగా రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ పదవిపై చర్చ జరగలేదు. గతంలోనే రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ పదవి వద్దని రాజీనామా చేశా. మంత్రి పదవి వదులుకుని ప్రొటోకాల్‌పై ఫీల్‌ అయ్యేదేముంది. కావాలనే పార్టీలోని కొందరు దుష్ప్రచారం చేశారు. నేనెప్పుడూ పార్టీపై అలగలేదు. పార్టీలోని కొందరు ఇబ్బందులు పెట్టారు. సీఎం జగన్‌ను ఎప్పుడూ కలుస్తూనే ఉన్నాను. నియోజకవర్గంపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. నా నియోజకవర్గంలో రూ.200 కోట్లతో ఇళ్ల స్థలాల పంపిణీకి ఏర్పాటు జరుగుతున్నాయి. సీఎం జగన్‌తో భేటీ వల్ల సంతృప్తిగానే ఉన్నాను’’ అని బాలినేని వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని