Andhra News: సొంత పార్టీ నేతలే నాపై కుట్ర చేస్తున్నారు: మాజీ మంత్రి బాలినేని ఆవేదన

విపక్షాలు సహా సొంత పార్టీ నేతలే తనపై కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధంలేని విషయాలను తనకు

Updated : 28 Jun 2022 06:38 IST

ఒంగోలు: విపక్షాలు సహా సొంత పార్టీ నేతలే తనపై కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధంలేని విషయాలను తనకు అంటగడుతున్నారని మండిపడ్డారు. గతంలో చెన్నైలో పట్టుబడిన బంగారు వ్యాపారి డబ్బు తనదని ప్రచారం చేసి, హవాలా మంత్రి అని అవమానించారన్నారు. ఇటీవల కొత్తపట్నం మండలం అల్లూరు మహిళ గొడవలోకి తనను లాగుతున్నారని పేర్కొన్నారు. ఇందుకు వైకాపాలోని పెద్ద నేతలు కూడా ఆమెతో మాట్లాడుతున్నారని చెప్పారు. ఈ మేరకు ఎవరెవరు ఏం చేస్తున్నారో అన్నీ తనకు తెలుసునన్నారు. వారికి ఏం అన్యాయం చేశానని ఇదంతా చేస్తున్నారని బాలినేని ప్రశ్నించారు. ‘‘అందరినీ ప్రశ్నిస్తానని పవన్‌ కల్యాణ్‌ అంటారు. మరి ఇంత జరుగుతుంటే తెలుగుదేశం పార్టీని ప్రశ్నించరా? నేను తప్పు చేసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పకొంటా’’ అని బాలినేని సవాల్‌ విసిరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని