Bandaru: గుంటూరు నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌కు మాజీ మంత్రి బండారు

ఏపీ సీఎం జగన్‌, మంత్రి రోజా పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలపై కేసులు నమోదు కావడంతో మాజీ మంత్రి బండారు సత్యనారాయణను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.  

Updated : 03 Oct 2023 06:53 IST

గుంటూరు:  ఏపీ సీఎం జగన్‌, మంత్రి రోజా పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలపై కేసులు నమోదు కావడంతో మాజీ మంత్రి బండారు సత్యనారాయణను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం తెల్లవారుజామున ఆయన్ను పోలీసులు గుంటూరు తీసుకొచ్చారు. వైద్య పరీక్షలు చేయించకుండానే ఆయన స్వగ్రామం వెన్నెలపాలెం నుంచి గుంటూరులోని నగరంపాలెం పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు.

తెదేపా నేత బండారు అరెస్టు.. 22 గంటల పాటు నాటకీయ పరిణామాలు

ఆదివారం రాత్రి 10 గంటల నుంచి బండారు సత్యనారాయణమూర్తి వెన్నెలపాలెంను చుట్టుముట్టిన పోలీసులు దాదాపు 22 గంటల పాటు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకుని చివరికి సోమవారం రాత్రి ఆయన్ను అరెస్టు చేశారు. మంత్రి రోజాపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గుంటూరులో బడి మంజుల చేసిన ఫిర్యాదుపై నమోదైన కేసులో బండారును అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని