Narayana: మాజీ మంత్రి నారాయణ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో తనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని, అలానే ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. 

Updated : 03 Oct 2023 12:40 IST

అమరావతి: అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో తనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని, అలానే ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. అరెస్టు చేయవద్దన్న గత ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం మరో రెండు వారాలు పొడిగించింది. అనంతరం విచారణను ఈనెల 16కు హైకోర్టు వాయిదా వేసింది.

Angallu case: ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. అంగళ్లు కేసులో జోక్యానికి సుప్రీం నిరాకరణ

ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో ఈనెల 4న లోకేశ్‌తో పాటు మరోసారి విచారణకు హాజరుకావాలంటూ సీఐడీ సోమవారం మరోసారి నారాయణకు నోటీసులు ఇచ్చింది. దీనిపై ఆయన హైకోర్టులో లంచ్ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆరోగ్య కారణాల రీత్యా గుంటూరులో విచారణకు హాజరుకాలేనని తెలిపారు. ఇంటి వద్దే విచారించేలా సీఐడీని ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు