Ponguru Narayana: తెదేపా నేత, ఏపీ మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌!

తెదేపాకు చెందిన మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణను ఏపీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలోని

Updated : 06 Dec 2022 14:02 IST

హైదరాబాద్‌: తెదేపాకు చెందిన మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణను ఏపీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలోని లోధా అపార్ట్‌మెంట్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన చిత్తూరు పోలీసులు.. తొలుత నారాయణను అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం నారాయణతోపాటు ఆయన సతీమణి రమాదేవిని వారి సొంత వాహనంలోనే ఏపీకి తరలించారు. నారాయణ అరెస్ట్‌ను చిత్తూరు పోలీసులు ధ్రువీకరించారు.

పదోతరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ఇటీవల చిత్తూరు ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. నారాయణ విద్యా సంస్థల నుంచి లీకేజీ జరిగిందనే ఆరోపణలతో కొద్దిరోజుల క్రితం వైస్‌ ప్రిన్సిపల్‌ గిరిధర్‌తో పాటు మరికొంతమందిని చిత్తూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడి పోలీసులు హైదరాబాద్‌ వచ్చి నారాయణను కూడా అరెస్ట్‌ చేసి తీసుకెళ్లారు. కుమారుడి వర్ధంతి కార్యక్రమంలో ఉండగా ఆయన్ను అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది.  మరోవైపు నారాయణను అదుపులోకి తీసుకున్న విషయాన్ని తెలుసుకున్న ఆయన విద్యాసంస్థల సిబ్బంది ఏపీకి వెళ్లే మార్గంలో టోల్‌గేట్ల వద్దకు చేరుకున్నారు. 

ఇటీవల ఏపీలో పదోతరగతి ప్రశ్నాపత్రాలు వరుసగా లీక్‌ అయ్యాయి. ఈ వ్యవహారం వెనుక నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలు ఉన్నట్లు కొద్దిరోజుల క్రితం తిరుపతి సభలో సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు హైదరాబాద్‌ వచ్చి నారాయణను అదుపులోకి తీసుకోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని