Peddi Reddy: పుంగనూరులో మాజీమంత్రి పెద్దిరెడ్డికి నిరసన సెగ

చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటిస్తారనే సమాచారం తెలుసుకున్న తెదేపా నాయకులు నిరసన వ్యక్తం చేశారు.

Published : 15 Jun 2024 12:10 IST

పుంగనూరు: చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటిస్తారనే సమాచారం తెలుసుకున్న తెదేపా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి గోబ్యాక్‌,.. పెద్దిరెడ్డి డౌన్‌ డౌన్‌.. అంటూ నినాదాలు చేశారు. నియోజకవర్గంలో పర్యటించవద్దని నాయకులు హెచ్చరించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అంబేడ్కర్‌ కూడలిలో బైఠాయించిన తెదేపా నాయకులు, ఎన్టీఆర్‌ కూడలి మీదుగా ఇందిరా సర్కిల్‌ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పెద్దిరెడ్డి పర్యటన వాయిదా వేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని