Exit polls 2022: గుజరాత్‌లో ముగిసిన పోలింగ్‌.. కాసేపట్లో ఎగ్జిట్‌పోల్స్‌!

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నిక(Gujarat Election2022)ల్లో రెండో దశ పోలింగ్‌ ముగిసింది. కాసేపట్లో ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెల్లడికానున్నాయి.

Updated : 05 Dec 2022 18:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నిక(Gujarat Election2022)ల్లో రెండో దశ పోలింగ్‌ ముగిసింది. క్యూలైన్లలో వేచి ఉన్న ఓటర్లకు ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. 93 నియోజకవర్గాల్లో కొనసాగిన రెండో విడత పోలింగ్‌లో సాయంత్రం 5గంటల వరకు దాదాపు 58.68శాతం మేర పోలింగ్‌ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాల సొంత రాష్ట్రం కావడంతో గుజరాత్‌ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా ఇక్కడ భాజపా, కాంగ్రెస్‌తో పాటు ఈసారి ఆప్‌కూడా రంగప్రవేశం చేయడంతో ఫలితం ఎలా ఉండబోతోందనన్న ఆసక్తి వ్యక్తమవుతోంది. గుజరాత్‌తో పాటు గత నెలలో పోలింగ్‌ పూర్తయిన హిమాచల్‌ప్రదేశ్‌లోనూ మరోసారి గెలిచి చరిత్ర సృష్టిస్తామని కమలనాథులు ధీమాతో ఉండగా.. కాంగ్రెస్‌, ఆప్‌లు కూడా గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నెల 8న గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు నిన్న పోలింగ్‌ జరిగిన దిల్లీ మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి పలు ప్రఖ్యాత సర్వే సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు కాసేపట్లో వెల్లడి కానున్నాయి. సాయంత్రం 6.30గంటలకు ఆయా సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ వివరాలు బహిర్గతం చేయనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని