Eknaht Shindhe: శిందే కేబినెట్‌లో ఫడణవీస్‌కే కీలక శాఖలు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shindhe) కేబినెట్‌లో డిప్యూటీ సీఎం, భాజపా సీనియర్‌ నేత దేవేంద్ర ఫడణవీస్‌(Devendra Fadnavis)కు కీలక శాఖలు దక్కాయి. ....

Published : 15 Aug 2022 01:16 IST

ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shindhe) కేబినెట్‌లో డిప్యూటీ సీఎం, భాజపా సీనియర్‌ నేత దేవేంద్ర ఫడణవీస్‌(Devendra Fadnavis)కు కీలక శాఖలు దక్కాయి. రాష్ట్ర హోం, ఆర్థిక శాఖల బాధ్యతలు ఆయనే చూడనున్నారు. శివసేన నుంచి ఏక్‌నాథ్‌ శిందే తిరుగుబాటు చేసిన తర్వాత ఉద్ధవ్‌ ఠాక్రే సర్కార్‌ కూలిపోవడంతో భాజపా సహకారంతో శిందే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాదాపు ఏడు వారాల తర్వాత ఎట్టకేలకు శాఖల కేటాయింపు పూర్తయింది. ఉద్ధవ్‌ రాజీనామాతో రాష్ట్రంలో అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో జూన్‌ 30న శిందే సీఎంగా, దేవేంద్ర ఫడణవీస్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.

ఆగస్టు 9న మంత్రివర్గ విస్తరణ చేపట్టి కేబినెట్‌లోకి కొత్తగా 18మందిని తీసుకోగా.. ఆదివారం శాఖల కేటాయింపు జరిగింది. సీఎంవో వెల్లడించిన వివరాల ప్రకారం.. హోంశాఖతో పాటు ఆర్థికం, ప్రణాళిక వంటి కీలక శాఖలు దేవేంద్ర ఫడణవీస్‌కు అప్పగించి.. సీఎం శిందే తన వద్ద పట్టణాభివృద్ధి శాఖను ఉంచుకోవడం గమనార్హం. అలాగే, భాజపా నేతలు రాధాకృష్ణ విఖే పాటిల్‌కు రెవెన్యూ శాఖ, సుధీర్‌ ముంగంటివార్‌ గతంలో పర్యవేక్షించిన అటవీశాఖను అప్పగించారు. భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌కు ఉన్నత విద్య, సాంకేతిక విద్యాశాఖ అప్పగించగా.. శివసేన తిరుగుబాటు వర్గం నేతలైన దీపక్‌ కేసర్‌కర్‌ పాఠశాల విద్య, అబ్దుల్‌ సత్తార్‌కు వ్యవసాయశాఖలు కేటాయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని