Published : 02 Jul 2022 02:11 IST

Devendra Fadnavis: ఫడణవీస్.. మొదటి అగ్నివీర్‌..!

ముంబయి: మహారాష్ట్రలో ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం కూలిపోయి.. శివసేన అసమ్మతి నేత ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ క్రమంలో అత్యధిక సభ్యులున్న భాజపా నుంచి మరోసారి దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రి అవుతారని అంతా భావించారు. దానికి విరుద్ధంగా శిందే ముఖ్యమంత్రి పదవి చేపట్టగా.. ఫడణవీస్‌ ఉపముఖ్యమంత్రి పోస్టుకు పరిమితం కావాల్సి వచ్చింది.  దీనిపై విపక్షాలు తమ విమర్శలకు పదును పెట్టాయి. ఆపరేషన్ లోటస్ కోసం పెద్దమొత్తంలో ఖర్చు చేసి, ఈ పోస్టు తీసుకోవడాన్ని ప్రశ్నిస్తున్నాయి. 

దేవేంద్ర ఫడణవీస్.. మొదటి అగ్నివీర్ అంటూ ఆర్జేడీ పార్టీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. కేంద్రం స్వల్పకాలిక సైనిక నియామకాల కోసం అగ్నిపథ్ పథకాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దానికింద ఎంపికైనవారి(అగ్నివీరులు)లో 75 శాతం మంది నాలుగు సంవత్సరాల తర్వాత విధులను నుంచి దిగిపోవాల్సి ఉంటుంది. ఉద్యోగ భద్రతకు హామీ లేకపోవడంతో ఈ పథకంపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి.

ఉద్ధవ్ ఠాక్రే వర్గం తరఫున ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ. భాజపా సీఎం పదవిపై రాజీపడటంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఫడణవీస్ మరో ఎల్‌కే అడ్వాణీ అంటూ వ్యాఖ్యలు చేశారు. 

‘ఆపరేషన్ లోటస్‌పై భారీగా ఖర్చుచేసి, హార్స్‌ ట్రేడింగ్‌కు పాల్పడిన భాజపా .. ఏ కారణం చేత ముఖ్యమంత్రి పదవిపై రాజీ పడిందనేది ఈ ఏడాదిలో అతి పెద్ద ప్రశ్న. ఏది ఏమైనప్పటికీ.. మనకు  భారత రాజకీయాల్లో మరో అడ్వాణీ వెలుగులోకి వచ్చారు. ఫడణవీస్‌కు శాశ్వత ఎదురుచూపులు మిగులుతాయి’ అంటూ ట్వీట్ చేశారు. అలాగే ‘నేను తిరిగొచ్చాను’ అంటూ ఫడణవీస్‌ చేసిన వ్యాఖ్యను మహారాష్ట్ర కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. ‘వచ్చారు. కానీ చూసేందుకే ’ అంటూ కౌంటర్ ఇచ్చింది. ఈ పరిణామంపై ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. ‘ఈ రెండో స్థానాన్ని ఫడణవీస్ సంతోషంగా స్వీకరించి ఉండరనుకుంటున్నాను. ఆయన ముఖం చూస్తే మనకు ఆ విషయం అర్థం అవుతుంది. అందుకు ఆయన విలువలే కారణం’ అంటూ వ్యాఖ్యలు చేశారు. 

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని