రైతుల పేరుతో రాజకీయం తగదు: తోమర్‌

సాగు చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు ఒక నిర్ధిష్ట ప్రాంతానికే పరిమితమని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ అన్నారు. ఈ అంశంలో రైతులు, కేంద్రానికి మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని తోమర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో విలేకరులతో మాట్లాడారు. 

Updated : 08 Feb 2021 04:34 IST

భోపాల్: సాగు చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు ఒక నిర్దిష్ట ప్రాంతానికే పరిమితమని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ అన్నారు. ఈ అంశంలో రైతులు, కేంద్రానికి మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని తోమర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో విలేకరులతో మాట్లాడారు. 

‘సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలు ఒక నిర్దిష్ట ప్రాంతానికే పరిమితం. త్వరలోనే ఈ విషయంలో రైతులు, కేంద్రానికి మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు పరిష్కారం లభిస్తుందని మేం భావిస్తున్నాం. ఇప్పటికీ రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది’ అని తోమర్ తెలిపారు. 

అదేవిధంగా నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న డిమాండ్‌ గురించి తోమర్‌ను ప్రశ్నించగా.. రైతుల సమస్యలపై మాట్లాడటానికి ఆ పార్టీకి ఎలాంటి హక్కు లేదని అన్నారు.  ‘కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం రైతుల కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. 2019 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ తమ మేనిఫెస్టోలో వ్యవసాయ రంగంలో సంస్కరణల గురించి హామీ ఇచ్చింది. అదే హామీలను మేం అమలు చేస్తే మాత్రం వ్యతిరేకిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ రైతుల పేరు చెప్పి రాజకీయాలు చేయాలనుకుంటే మాత్రం ఎప్పటికీ విజయం సాధించదు’ అని తోమర్‌ విమర్శించారు. కేంద్రం తెచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా 72 రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. 

ఇదీ చదవండి

ఉత్తరాఖండ్‌లో జలప్రళయం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని