Hyderabad: భాజపా కార్యాలయం వద్ద విజయోత్సవ వేడుకల్లో అపశృతి

నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద విజయోత్సవ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. విద్యుత్‌ వైర్లు దగ్ధం కావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Updated : 08 Dec 2022 17:08 IST

హైదరాబాద్‌: నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద విజయోత్సవ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. గుజరాత్‌లో భాజపా ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆపార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. భాజపా కార్యాలయం వద్ద టపాసులు పేల్చి, మిఠాయిలు పంచారు. ఈక్రమంలో నిప్పురవ్వలు ఎగసిపడి పార్టీ కార్యాలయం సమీపంలో ఉన్న విద్యుత్ తీగలు, ఫ్లెక్సీలపై పడ్డాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన భాజపా శ్రేణులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించి, మంటలు ఆర్పేందుకు  ప్రయత్నించారు. విద్యుత్‌ వైర్లు దగ్ధం కావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని