Harish Rao: పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ రైతన్న సంక్షేమంపై లేదు

రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 05 Jul 2024 04:18 IST

ప్రభుత్వంపై హరీశ్‌రావు ధ్వజం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు నిత్యకృత్యంగా మారినా.. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేకపోవడం దుర్మార్గమన్నారు. ‘ఎక్స్‌’ వేదికగా గురువారం హరీశ్‌రావు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ‘‘ఖమ్మం జిల్లాలో మొన్న ఒక రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదలగా.. తన సమస్యకు పరిష్కారం చూపడం లేదనే ఆవేదనతో నిన్న సీఎం సొంత జిల్లాలో ఓ అన్నదాత ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలు మరవక ముందే నేడు ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఆలియా తండాలో మరో రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్రభుత్వానికి పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ.. పట్టెడన్నం పెట్టే రైతుల సంక్షేమం పట్ల లేదు’’ అని హరీశ్‌రావు దుయ్యబట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని