YSRCP: వైకాపాకు మాజీ మంత్రి రాజీనామా..

వైకాపాకు మాజీ మంత్రి శిద్దా రాఘవరావు రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌కు తన రాజీనామా లేఖను పంపారు

Updated : 17 Jun 2024 17:12 IST

అమరావతి: వైకాపాకు మాజీ మంత్రి శిద్దా రాఘవరావు రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌కు తన రాజీనామా లేఖను పంపారు. వ్యక్తిగత కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. శిద్దా తనకు పూర్వ పరిచయాలున్న దర్శి నుంచే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి మొగ్గుచూపినా వైకాపా అధిష్ఠానం పట్టించుకోలేదు. ఉమ్మడి ప్రకాశంలోని అద్దంకి, ఒంగోలు, మార్కాపురం స్థానాల్లో ఏదోఒక సీటు నుంచి పోటీ చేయాలని చేసిన ప్రతిపాదనలను ఆయన తిరస్కరించారు. చివరికి శిద్దా మౌనంగా ఉండిపోయారు. ఈ దఫా తమ కుటుంబం ఎన్నికలకు దూరంగా ఉంటుందని సన్నిహితుల వద్ద చెబుతూ వచ్చారు. పార్టీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని