HCA: కల్వకుంట్ల కుటుంబం వల్లే హెచ్‌సీఏలో గందరగోళ పరిస్థితులు: వివేక్‌

హైదరాబాద్‌: కల్వకుంట్ల కుటుంబం వల్లే హైదరాబాద్‌ క్రిక్‌ట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ)లో గందరగోళ పరిస్థితులు

Updated : 24 Sep 2022 18:40 IST

హైదరాబాద్‌: కల్వకుంట్ల కుటుంబం వల్లే హైదరాబాద్‌ క్రిక్‌ట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ)లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని భాజపా నేత వివేక్‌ వెంకటస్వామి ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ కవితను హెచ్‌సీఏ అధ్యక్షురాలిని చేసేందుకు సీఎం కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. భారత్‌, ఆసీస్‌ మూడో టీ20 మ్యాచ్‌కు సంబంధించి ఎన్ని టికెట్లు విక్రయించారో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. 

‘‘సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మ్యాచ్‌ టికెట్లు విక్రయించామన్నారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలి. ఎన్ని టికెట్లు ఇచ్చారు? ఎన్ని బాక్స్‌లు, ఎంత మందికి కేటాయించారు? డబ్బులు చెల్లించిన వారికి బాక్స్‌లు ఇచ్చారా? లేదా? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. గతంలో ఇలాంటి ఘటనలు హెచ్‌సీఏలో జరగలేదు. తాజా పరిస్థితులకు కారణం కల్వకుంట్ల కుటుంబం. ఎందుకంటే వారికి క్రికెట్‌ అసోసియేషన్ మీద ధ్యాసలేదు. కానీ, కవితను ఎలాగైనా హెచ్‌సీఏ అధ్యక్షురాలిని చేయాలని చూస్తున్నారు. క్రీడారంగంలోని అన్ని అసోసియేషన్‌లో కేటీఆర్‌, కవిత ఇద్దరిలో ఎవరిదో ఒకరిది పేరు ఉండాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో నేను హెచ్‌సీఏ అధ్యక్షుడిగా నిలబడతానని చెప్పినపుడు హెచ్‌సీఏ మీకెందుకు? పోటీ చేయొద్దు అని కేసీఆర్‌ చెప్పారు’’ అని వివేక్‌ గుర్తు చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని