Pocharam Srinivas Reddy: నా రాజకీయ ప్రస్థానం మొదలైన చోటే ముగింపునకు వచ్చింది!

రాష్ట్ర అభ్యున్నతి కోసమే తాను సీఎం రేవంత్‌రెడ్డికి మద్దతు పలుకుతూ కాంగ్రెస్‌లో చేరినట్లు బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్‌లో మొదలైన తన రాజకీయ ప్రస్థానం అందులోనే ముగింపునకు వచ్చిందన్నారు.

Published : 25 Jun 2024 04:04 IST

మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి 

మల్లికార్జునఖర్గే, రాహుల్‌గాంధీలతో పోచారం శ్రీనివాస్‌రెడ్డి. చిత్రంలో పోచారం కుమారులు భాస్కర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీవేణుగోపాల్, పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌చౌధరి తదితరులు

ఈనాడు, దిల్లీ: రాష్ట్ర అభ్యున్నతి కోసమే తాను సీఎం రేవంత్‌రెడ్డికి మద్దతు పలుకుతూ కాంగ్రెస్‌లో చేరినట్లు బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్‌లో మొదలైన తన రాజకీయ ప్రస్థానం అందులోనే ముగింపునకు వచ్చిందన్నారు. ఆయన సోమవారం రాత్రి రేవంత్‌రెడ్డితో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీని కలిసిన అనంతరం ఏఐసీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘ఆరు నెలలుగా తెలంగాణ ప్రభుత్వ పనితీరు, అంకితభావం, పట్టుదలను చూశా. అందుకే రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలన్న ఉద్దేశంతో నా కుమారుడితో కలిసి కాంగ్రెస్‌లో చేరా. నా రాజకీయ జీవితం కాంగ్రెస్‌తోనే ప్రారంభమైంది. 1977లో కాంగ్రెస్‌ కండువా వేసుకొని రాజకీయ జీవితం ప్రారంభించా. 1984 వరకు అందులోనే కొనసాగా. ఎన్టీఆర్‌ పిలుపు మేరకు తెలుగుదేశంలోకి వెళ్లి 27 ఏళ్లు పనిచేశా. తర్వాత 11 ఏళ్లు కేసీఆర్‌ నాయకత్వంలో పనిచేశా. నా రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైందో అక్కడే ముగింపునకు వచ్చింది’’ అని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని