UP Polls: ఎన్నికల వేళ.. భాజపాను వీడి ఎస్పీ తీర్థం పుచ్చుకొని..!

ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. అధికార భాజపాకు ఎదురుదెబ్బలు మొదలైన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఓబీసీ నేత స్వామి ప్రసాద్‌ మౌర్య, ధరమ్‌ సింగ్‌ సైనీ ఇటీవలే భాజపాకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Updated : 15 Jan 2022 16:26 IST

ఎస్పీలో చేరిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. అధికార భాజపాకు ఎదురుదెబ్బలు మొదలైన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఓబీసీ నేత స్వామి ప్రసాద్‌ మౌర్య, ధరమ్‌ సింగ్‌ సైనీ ఇటీవలే భాజపాకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కేబినెట్‌లో పనిచేసిన వారిద్దరు నేడు అఖిలేష్‌ యాదవ్‌ సమక్షంలో సమాజ్‌వాదీ పార్టీ కండువా కప్పుకొన్నారు. వీరితో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా ఎస్‌పీలో చేరారు. అయితే, యూపీ మంత్రివర్గంలో ఉన్న ధారాసింగ్‌ చౌహాన్‌ భాజపాకు రాజీనామా చేస్తున్నట్లు రెండు రోజుల క్రితం ప్రకటించినప్పటికీ నేడు ఎస్‌పీలో మాత్రం చేరలేదు.

భాజపాకు రాజీనామా చేసిన భగవతీ సాగర్‌, వినయ్‌ షాఖ్య, ముకేశ్‌ వర్మ, రోషన్‌లాల్‌ వర్మ, బ్రిజేశ్‌ ప్రజాపతి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. వీరితోపాటు యూపీ భాజపా కూటమిలో భాగస్వామిగా ఉన్న అప్నాదళ్‌(ఎస్‌)కు చెందిన ఎమ్మెల్యే చౌధరి అమర్‌సింగ్‌ కూడా ఎస్‌పీ తీర్థం పుచ్చుకున్నారు. వెనుకబడిన వర్గాలు, దళితుల ప్రయోజనాల కోసమే తాము ఈ పార్టీలో చేరుతున్నట్లు ధరమ్‌ సింగ్‌ సైనీ వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో అఖిలేష్‌ను ముఖ్యమంత్రిగా చేసే లక్ష్యంతోనే తాము పనిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన స్వామి ప్రసాద్‌ మౌర్య.. మకర సంక్రాంతి రోజునే యూపీలో భాజపా ముగింపునకు నాంది పడిందని చెప్పుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని