
‘అధికారమంటే ఏంటో చూపించారు’.. గడ్కరీపై పవార్ ప్రశంసలు
పుణె: కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్ పవార్ ప్రశంసలు గుప్పించారు. అధికారాన్ని ఉపయోగించుకుని అభివృద్ధి పనులు ఎలా చేయాలో ఆయన చేసి చూపించారని కొనియాడారు. ఈ మేరకు అహ్మద్‌నగర్‌లో జరిగిన కార్యక్రమంలో గడ్కరీతో వేదిక పంచుకున్నారు. అనంతరం మాట్లాడుతూ గడ్కరీని ప్రశంసల్లో ముంచెత్తారు.
అహ్మద్‌నగర్‌లో సుదీర్ఘంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను గడ్కరీ త్వరలో ప్రారంభించబోతున్నారని తెలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యానని పవార్ తెలిపారు. ప్రజాప్రతినిధి తన అధికారాన్ని దేశాభివృద్ధికి ఎలా ఉపయోగించాలో గడ్కరీ నిరూపించారని కొనియాడారు. గడ్కరీ రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టేనాటికి 5000 కిలోమీటర్ల మేర పనులు పూర్తవ్వగా.. ఆ తర్వాత ఆ సంఖ్య 12వేల కిలోమీటర్లకు చేరిందని చెప్పారు. చెరకు రైతులు తమ పంటను కేవలం చక్కెర తయారీకే కాకుండా ఇథనాల్ ఉత్పత్తికి ముడిసరకుగా కూడా వినియోగించొచ్చన్న దిశగా ఆలోచన చేయాలని పవార్ సూచించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Lalu Prasad Yadav: ‘నాన్న మీరే నా హీరో’.. భావోద్వేగ పోస్టు పెట్టిన లాలూ కుమార్తె..!
-
Business News
Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించుకోండిలా..
-
Movies News
Pawan Kalyan: ఆయన సినిమా రివ్యూలు ఎంతో ఆసక్తిని రేకెత్తించేవి: పవన్‌కల్యాణ్
-
India News
Modi: ఆ చిన్నారిని కలిశాక.. నాలో విశ్వాసం పెరిగింది: మోదీ
-
World News
USA Mass Shooting: తుపాకీ నీడన అమెరికా.. అత్యాధునిక ఆయుధంతో 22ఏళ్ల యువకుడి కాల్పులు
-
India News
India Corona: 13 వేల కొత్త కేసులు.. 12 వేల రికవరీలు..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- IND vs ENG : మొత్తం మారిపోయింది
- Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- Double BedRooms: అమ్మకానికి.. రెండు పడక గదుల ఇళ్లు!
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్యకు రూ.4.50 లక్షల సుపారీ!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/07/22)
- Hyderabad News: రోజూ ‘బయోమెట్రిక్’ వేసి వెళ్తే నెలకు రూ. 15 వేలు!
- Viral video: రియల్ హీరో.. కరెంటు షాక్‌తో విలవిల్లాడుతున్న ఆవును రక్షించిన యువకుడు