Ganta srinivasarao: అంత అభద్రతా జీవితమెందుకు జగన్‌?: మాజీ మంత్రి గంటా

‘కళ్లు చెదిరే ప్యాలెస్‌లే కాదు.. ఏకంగా 15 కంపెనీలకు, 2 బెటాలియన్లకు సరితూగే సిబ్బందితో దేశంలో ఎవరికీ లేని విధంగా 934 మందితో భద్రతా? జగన్‌మోహన్‌రెడ్డీ ఇలాంటి వింత పోకడలు, అభద్రతా భయాల మధ్య జీవనం ఎందుకు గడుపుతున్నారు? ఏదైనా దేశం వచ్చి మీపై దండయాత్ర చేస్తుందని భయపడుతున్నారా?’ అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు.

Updated : 25 Jun 2024 10:17 IST

ఈనాడు, అమరావతి: ‘కళ్లు చెదిరే ప్యాలెస్‌లే కాదు.. ఏకంగా 15 కంపెనీలకు, 2 బెటాలియన్లకు సరితూగే సిబ్బందితో దేశంలో ఎవరికీ లేని విధంగా 934 మందితో భద్రతా? జగన్‌మోహన్‌రెడ్డీ ఇలాంటి వింత పోకడలు, అభద్రతా భయాల మధ్య జీవనం ఎందుకు గడుపుతున్నారు? ఏదైనా దేశం వచ్చి మీపై దండయాత్ర చేస్తుందని భయపడుతున్నారా?’ అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. తాడేపల్లి ప్యాలెస్‌ చుట్టూ 48 చోట్ల చెక్‌పోస్టులు, దేశంలో ఉన్నప్పుడు, విదేశాల్లో ఉన్నప్పుడు కూడా భద్రత కల్పించేలా ప్రత్యేక ఏర్పాటు ఎందుకు అని ఒక ప్రకటనలో ప్రశ్నించారు. జడ్‌ ప్లస్‌ కేటగిరీలో ఉన్న చంద్రబాబు సైతం ఏనాడూ ఈ స్థాయి    భద్రతను ఏర్పాటు చేసుకోలేదని పోలీసులే అంటున్నారని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని