Rajasthan Crisis: దిల్లీకి గహ్లోత్‌.. సోనియాతో భేటీ కానున్న సీఎం..!

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక వేళ.. రాజస్థాన్‌ రాజకీయాల్లో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి.

Published : 28 Sep 2022 14:21 IST

జైపుర్: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక వేళ.. రాజస్థాన్‌ రాజకీయాల్లో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. అధ్యక్ష ఎన్నికలో గెలుపొందినా, ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలని అశోక్ గహ్లోత్ ఆశించడం.. ఎలాగైనా ఆ పీఠంపై కూర్చోవాలని సచిన పైలట్‌ ప్రయత్నించడం ఈ పరిస్థితికి దారితీసింది. ఈ క్రమంలో గహ్లోత్ దిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ రోజు ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ కానున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం ఆయన అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తారా..? లేదా..? అనేది ఈ సమావేశంతో తేలనున్నట్లు తెలుస్తోంది. 

ఆదివారం రాత్రి రాజస్థాన్‌ ప్రభుత్వంలోని 82 మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌కు రాజీనామా సమర్పించడంతో అక్కడ రాజకీయ హైడ్రామా మొదలైంది. ఇందులో తన ప్రమేయం లేదని గహ్లోత్ చెప్తున్నారు. సంక్షోభానికి ముఖ్యమంత్రి బాధ్యులు కాదని ఆ రాష్ట్రానికి పరిశీలకులుగా వచ్చిన నేతలు సోనియాకు ఇచ్చిన నివేదికలో వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే, మూడు రోజుల క్రితం జైపుర్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశానికి పిలుపునిచ్చిన నేతలపై చర్యలు తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. దాంతో ధిక్కార స్వరం వినిపించిన గహ్లోత్ విధేయులు ముగ్గురికి మంగళవారం రాత్రి షోకాజ్‌ నోటీసులు జారీ అయ్యాయి. ఈ సమయంలోనే ఆయన దిల్లీకి వెళ్లారు. నిన్న యువనేత సచిన్‌ పైలట్ కూడా దిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని