జగన్‌ ఇంటికి అనుమతి ఉందా?:ధూళిపాళ్ల

రాజధానిలో భూ అక్రమాలంటూ వైకాపా పాత అసత్యాలనే మళ్లీ చెప్పిందని తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. రాజధాని మార్చాలనే ఆలోచనతోనే ఆ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం...

Published : 03 Jan 2020 20:05 IST

అమరావతి: రాజధానిలో భూ అక్రమాలంటూ వైకాపా పాత అసత్యాలనే మళ్లీ చెప్పిందని తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. రాజధాని మార్చాలనే ఆలోచనతోనే ఆ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా కార్యాలయంలో మీడియాతో ధూళిపాళ్ల మాట్లాడారు. రాజధానిలో సీఎం జగన్‌ ఇల్లు కట్టిన సంస్థలు కూడా అదే సమయంలో తాడేపల్లిలో భూములు కొన్నాయని.. ఆ భూములను సేకరించిన వాళ్లు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేసినట్లేనా?.. తాడేపల్లిలో జగన్‌ బినామీలు భూములు కొన్నారా?లేదా? అని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఆరోపణలు చేస్తూనే ఉన్నారని.. ఇప్పుడు అధికారంలో ఉన్నందున ఏ విచారణ అయినా చేసుకోవచ్చన్నారు. ప్రజలను మాత్రం బలిపశువులను చేయొద్దని ధూళిపాళ్ల హితవు పలికారు. ‘‘జగన్‌ ఇల్లు నిర్మించిన లే అవుట్‌కు అనుమతి ఉందా? ఆయన అనధికార లే అవుట్‌లో నివాసముంటున్నారు’’ అని ఆరోపించారు. అనుమతిలేని కట్టడంలో ఉంటున్న సీఎం ఇంటిని కూల్చుతారా? అని ప్రశ్నించారు. మేకతోటి సుచరిత మహిళా హోంమంత్రిగా ఉండి కూడా గ్రామాల్లో మహిళలపై దౌర్జన్యం జరిగినా స్పందించక పోవడం విచారకరమని ఆయన విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని