సీఏఏ నంబర్‌పై ట్రోల్స్‌.. భాజపా స్పందన

పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) ప్రజల మద్దతు కోరుతూ భాజపా విడుదల చేసిన నంబర్‌పై వస్తున్న ట్రోల్స్‌ విషయంలో ఆ పార్టీ ఆదివారం స్పందించింది. తాము సీఏఏపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నంబర్‌(8866288662) విడుదల చేయగా ప్రతిపక్షాలు దానిపై తప్పుడు పోస్ట్‌లు సృష్టించి గందరగోళానికి గురిచేస్తున్నాయని పార్టీ ఆరోపించింది.

Published : 06 Jan 2020 01:29 IST

దిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) ప్రజల మద్దతు కోరుతూ భాజపా విడుదల చేసిన నంబర్‌పై వస్తున్న ట్రోల్స్‌ విషయంలో ఆ పార్టీ ఆదివారం స్పందించింది. తాము సీఏఏపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నంబర్‌(8866288662) విడుదల చేయగా ప్రతిపక్షాలు దానిపై తప్పుడు పోస్ట్‌లు సృష్టించి గందరగోళానికి గురిచేస్తున్నాయని పార్టీ ఆరోపించింది. పార్టీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మేము సీఏఏ మద్దతు కోసం ఇచ్చిన నంబరును కొందరు ఒంటరిగా ఉన్న అమ్మాయినంటూ.. నెట్‌ఫ్లిక్స్‌ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ పేరుతో తప్పుగా ఉపయోగిస్తున్నారు. ప్రతిపక్షాలు ఇలాంటి తప్పుడు పోస్ట్‌లు సృష్టించి ప్రజలను తికమక చేయడం తగదన్నారు. భాజపా దశాబ్దాలుగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తోందని అన్నారు. 

అదేవిధంగా మోదీ ప్రభుత్వాన్ని, ఆర్‌ఎస్‌ఎస్‌ను లక్ష్యంగా చేసుకుని ఇమ్రాన్‌ఖాన్‌ చేస్తున్న ట్వీట్లపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాద దేశానికి ఖాన్‌ నాయకత్వం వహిస్తున్నాడని ఆయనపై మండిపడ్డారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ అనంతరం అసహనానికి గురైన ఖాన్‌ ఏదోవిధంగా భారత ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. మరోవైపు ఆదివారం దిల్లీలో నిర్వహించిన భాజపా బూత్‌ కార్యకర్తల సమావేశంలో హోంమంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ.. సీఏఏకు మద్దతు కోరుతూ మేము ఇచ్చిన నంబర్‌పై కొందరు తప్పుడు పోస్ట్‌లు ప్రచారం చేస్తున్నారు. ఆ నంబర్‌ పార్టీకి చెందింది.. కానీ నెట్‌ఫ్లిక్స్‌ది కాదని అన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని