‘పీవోకే స్వాధీనం చేసుకుంటే భాజపాలో చేరతా’

జమిలి ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలన్నీ కనుమరుగవుతాయని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 370 ఆర్టికల్‌ రద్దును సమర్థిస్తున్నాని, కొన్ని...

Published : 05 Jan 2020 19:18 IST

మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి

అమరావతి: జమిలి ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలన్నీ కనుమరుగవుతాయని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 370 ఆర్టికల్‌ రద్దును సమర్థిస్తున్నాని, కొన్ని విషయాల్లో ప్రధాని మోదీకి జై అనాల్సిందేనని దివాకర్‌ రెడ్డి అన్నారు. భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ను అనంతపురం ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహంలో ఇవాళ జేసీ కలిశారు. అనంతరం మాట్లాడుతూ.. జాతీయ పార్టీలతోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యం తగ్గిపోతోందని చెప్పారు. అయితే ప్రాంతీయ పార్టీలు ఉన్నంత వరకు తెలుగుదేశంలో ఉంటానని జేసీ స్పష్టం చేశారు. కానీ, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకుంటే మాత్రం భాజపాలో చేరుతానన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని