మున్సిపల్‌ ఎన్నికల్లో ఒంటరిగానే:కోదండరాం

మున్సిపల్‌ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు తెజస అధ్యక్షుడు కోదండరాం వెల్లడించారు. దీనికోసం రెండు కమిటీలను వేసినట్లు ఆయన తెలిపారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని, ప్రతిపక్షాలను బలహీనపర్చాలనే

Published : 06 Jan 2020 14:57 IST

హైదరాబాద్: మున్సిపల్‌ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు తెజస అధ్యక్షుడు కోదండరాం వెల్లడించారు. దీనికోసం రెండు కమిటీలను వేసినట్లు ఆయన తెలిపారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని, ప్రతిపక్షాలను బలహీనపర్చాలనే ఉద్దేశంతోనే వార్డుల విభజన చేశారని ఆయన మండిపడ్డారు. ఈ నెల 8న జాతీయ స్థాయిలో రైతుబంధు కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు కోదండరాం పేర్కొన్నారు. మరోవైపు జేఎన్‌యూలో ముసుగులు ధరించి విద్యార్థులపై దాడి చేయడం దారుణమని కోదండరాం అన్నారు. జేఎన్‌యూ దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని