వైఎస్‌ విజయలక్ష్మి, షర్మిలకు కోర్టు సమన్లు

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయలక్ష్మి, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలకు 2012 నాటి కేసులో ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీ చేసింది.

Published : 07 Jan 2020 06:45 IST

 

ఈనెల 10న హాజరవ్వాలని ఆదేశం

 హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయలక్ష్మి, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలకు 2012 నాటి కేసులో ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. వారితో పాటు ఏ3, ఏ4లుగా ఉన్న అప్పటి పరకాల వైసీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళికి కూడా సమన్లు జారీ చేసింది. వీరందరూ ఈనెల 10న ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు కావాల్సి ఉంది. ముందస్తు అనుమతి లేకుండా రోడ్డుపై సభ నిర్వహించారని, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పరకాల పోలీస్‌స్టేషన్‌లో వారిపై కేసు నమోదైంది. మరో పక్క ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌ కూడా అదే రోజు హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుకావాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని