గృహనిర్బంధం నుంచి తప్పించుకొని పోలీస్‌స్టేషన్‌కు..

అమరావతి రైతులు చేపట్టిన జాతీయ రహదారి దిగ్బంధం కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు అనేక మంది విపక్ష నేతలను గృహనిర్బంధం చేయగా..

Updated : 07 Jan 2020 15:41 IST

లోకేశ్‌ను విడుదల చేయాలంటూ పంచుమర్తి, వైవీబీ ఆందోళన

విజయవాడ: అమరావతి రైతులు చేపట్టిన జాతీయ రహదారి దిగ్బంధం కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు అనేక మంది విపక్ష నేతలను గృహనిర్బంధం చేయగా.. చినకాకాని వద్ద తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సహా పలువురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, గృహనిర్బంధంలో ఉన్న తెదేపా ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌ పోలీసుల నుంచి తప్పించుకొని తోట్లవల్లూరు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. ఆయనతో పాటు భారీ సంఖ్యలో తెదేపా కార్యకర్తలు అక్కడికి చేరుకొని నారా లోకేశ్, ఇతర నేతలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు, తోట్లవల్లూరు పోలీస్‌ స్టేషన్‌ వద్ద తెదేపా మహిళా నేత పంచుమర్తి అనురాధ బైఠాయించి నిరసన తెలిపారు. మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు అంటూ నినాదాలు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని