సమ్మెకు కేసీఆర్‌ నాయకత్వం వహించాలి:సీపీఐ

ఎన్‌ఆర్సీకి వ్యతిరేకంగా ఓటేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ రేపటి సార్వత్రిక సమ్మెకు నాయకత్వం వహించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కోరారు. కేంద్రంలో

Updated : 07 Jan 2020 20:02 IST

హైదరాబాద్‌: ఎన్‌ఆర్సీకి వ్యతిరేకంగా ఓటేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ రేపటి సార్వత్రిక సమ్మెకు నాయకత్వం వహించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కోరారు. కేంద్రంలో ఎన్‌ఆర్సీని వ్యతిరేకించిన కేసీఆర్‌ ఆ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో జరుగుతున్న పోరాటాలను అణచివేస్తూ ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో మీడియాతో నారాయణ మాట్లాడారు. దేశ రాజధానిలోని జేఎన్‌యూలో విద్యార్థులపై గూండాలు దాడి చేయటం బాధాకరమన్నారు. జేఎన్‌యూ అత్యంత మేధావులను తయారు చేసిన ప్రగతిశీల కర్మాగారమన్నారు. పట్టపగలు దాడి జరిగిందంటే దీని వెనుక కేంద్ర ప్రభుత్వంతోపాటు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. ఈ దాడిని సీపీఐ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఘటనపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని నారాయణ డిమాండ్‌ చేశారు.

ఓటరు జాబితా సిద్ధం కాకుండానే, రిజర్వేషన్లు ఖరారు కాకుండానే ఎన్నికల కమిషన్‌ మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తప్పుబట్టారు. కేసీఆర్‌ మెప్పుకోసమే ఎన్నికల కమిషన్‌ తొందరపాటు నిర్ణయం తీసుకుందని విమర్శించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కలిసి వచ్చే శక్తులతో ముందుకు వెళ్తామని చాడ స్పష్టం చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని