అక్కడికి వెళ్లి ఉంటే ఇలాగే విమర్శలు చేసేవారా?

దీపిక జేఎన్‌యూ సందర్శనపై భాజపా నేతలు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. దీపిక నటించిన సినిమాలను బహిష్కరించాలని ఆ పార్టీ నేతలు పిలుపునిచ్చారు.

Published : 09 Jan 2020 01:05 IST

దిల్లీ: దీపిక జేఎన్‌యూ సందర్శనపై భాజపా నేతలు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. దీపిక నటించిన సినిమాలను బహిష్కరించాలని ఆ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. భాజపా నేతల విమర్శలపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ సైతం స్పందించింది. దీపిక జేఎన్‌యూ కాకుండా నాగ్‌పూర్‌లో ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయానికి వెళ్లి ఉంటే ఇలాగే విమర్శలు చేసేవారా అని ప్రశ్నించింది. దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో జరిగిన దాడిలో గాయపడిన విద్యార్థులను పరామర్శించేందుకు బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె మంగళవారం రాత్రి వర్సిటీని సందర్శించారు.
ఇదిలా ఉండగా.. ‘అధికార భాజపా దిగజారి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతోంది. నకిలీ వీడియోలు, పోల్స్‌ పెట్టి ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. దీపికను తాను నటించిన చపాక్‌ సినిమా ప్రచారం చేసుకునేందుకు నాగ్‌పూర్‌లోని సంఘ్‌ ప్రధాన కార్యాలయానికి వెళ్లమంటారా.? అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పవన్‌ ఖేరా ప్రశ్నించారు. అసలు ఈ దేశం ఎలా ఉండాలని భాజపా కోరుకుంటోందని ఆయన అడిగారు. యూనివర్సిటీలో విద్యార్థులపై దాడి చేసినవారిని వదిలేసి గాయపడిన విద్యార్థులపై ప్రభుత్వం కేసులు నమోదు చేయించిందని ఆయన అన్నారు. ఆందోళన చేస్తున్న యువతకు మద్దతు తెలిపినవారిని ప్రశ్నిస్తూ ఇబ్బందులకు గురి చేస్తారా.? అని అసహనం వ్యక్తం చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని